తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయం' - Babu Jagjivan Ram Jayanti

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం అని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

Jagjivan Ram Jayanti Celebrations
జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

By

Published : Apr 5, 2021, 6:55 PM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 114 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. యువత మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details