నాగర్ కర్నూల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఈరోజు సాయంత్రం ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారడం వల్ల మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
నాగర్ కర్నూల్లో పిచ్చికుక్కల స్వైర విహారం - నాగర్ కర్నూల్లో పిచ్చికుక్కల స్వైర విహారం
ఈ మధ్య పిచ్చికుక్కల దాడి పెరుగుతోంది. తాజాగా నాగర్ కర్నూల్లో పిచ్చికుక్కలు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
నాగర్ కర్నూల్లో పిచ్చికుక్కల స్వైర విహారం
కుక్కల బెడద తీవ్రంగా ఉన్నా మున్సిపాలిటీ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలు లేకుండా చేయాలన్నారు.
ఇదీ చూడండి:కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్కా బీ నహీ: భట్టి