నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు ఆందోళన నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిరసన - ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ ధర్నా
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖరులు, స్థిరాస్తి వ్యాపారులు నిరసన చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గేటుకు తాళం వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
![ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిరసన document writers and real estate holders dharna at nagar kurnool dist kalwakurthy sub registrar office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9991904-327-9991904-1608810435811.jpg)
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిరసన
ఎల్ఆర్ఎస్ వల్ల పేద కుటుంబాల మీద అధిక భారం పడుతోందన్నారు. కరోనాతో తొమ్మిది నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమాచారం అందుకున్న ఆర్డీవో రాజేశ్‌కుమార్, ఎస్సై మహేందర్ ఆందోళన విరమించాలని నిరసనకారులకు సర్దిచెప్పారు. ధర్నా విరమించిన అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.