తెలంగాణ

telangana

ETV Bharat / state

డాక్టర్​  సాహస యాత్ర..16వేల కి.మీ ప్రయాణం - డాక్టర్​ సాహస యాత్ర

మహిళలకు సోకే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్​ నివారణ  ఆవశ్యకతను వివరిస్తూ కర్ణాటక రాష్ట్రం బెలగావ్​కు చెందిన వైద్యురాలు నమ్రతా సింగ్​ సాహస యాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను బైక్​పై చుట్టేసిన నమ్రత ఇప్పుడు నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలానికి చేరారు.

doctor sahasa yatra reached to kalvakurti in nagarkarnul district
కల్వకుర్తికి చేరిన డాక్టర్​ సాహస యాత్ర

By

Published : Dec 17, 2019, 12:46 PM IST

కల్వకుర్తికి చేరిన డాక్టర్​ సాహస యాత్ర

మహిళల్లో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించడానికి కర్ణాటక రాష్ట్రం బెలగావ్​కు చెందిన డాక్టర్ నమ్రతా సింగ్ సాహసయాత్ర చేపట్టారు. ​

వైద్యవృత్తికి రాజీనామా చేసిన ఆమె దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 1న ఛత్తీస్​గఢ్​ జగదల్పూర్​ నుంచి బైక్ యాత్ర మొదలుపెట్టారు. సుమారు 16వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నారు.

కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చిన్న వయసులోనే ఈ వ్యాధుల గురించి తెలిస్తే.. భవిష్యత్​లో ఇవి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అందుకే ప్రాథమిక పాఠశాలు, కళాశాలల స్థాయి విద్యా సంస్థలు సందర్శిస్తున్నట్లు నమ్రత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details