నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల, బల్మూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి శర్మన్ ఆకస్మికంగా పర్యటించారు. అంబటిపల్లి, సురాపూర్, గోదల్ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అంబటిపల్లిలో రోడ్లపై నీటి జాలు వస్తుండడంతో సర్పంచ్‌పై అసహనం వ్యక్తం చేశారు. అంబటిపల్లి, సురాపూర్ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి నోటీసులు జారీ చేశారు.
గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన - నాగర్‌కర్నూల్ జిల్లా తాజా వార్తలు
వానాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శర్మన్ అన్నారు. లింగాల, బల్మూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన
సురాపూర్లో రైతు వేదికల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వీధుల్లో తిరిగి గ్రామస్థులతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ