తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం' - Essential commodities Calvacurti Zone

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామపంచాయతీ పరిధిలోని 65మంది పాస్టర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Essential commodities for families of 65 pastors of the Grama Panchayat to change the Calvacurti Zone
తెరాస పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం

By

Published : Jun 7, 2020, 12:16 AM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామపంచాయతీ పరిధిలోని పాస్టర్లకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాజేశ్వర రావు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై...65మంది పాస్టర్లకు నిత్యావసర సరకులను అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో.. ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ గోవర్ధన్, పురపాలిక ఛైర్మన్ సత్యం రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details