తెలంగాణ

telangana

ETV Bharat / state

కళ్లను నెత్తికెక్కించుకున్న చేపలు - fishes

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని సోమశిల వద్ద అరుదైన చేపలు కనిపించాయి.  కృష్ణా నది తీరంలో ఈ చేపలు లభిస్తాయని మత్స్యశాఖ అధికారి డాక్టర్‌ బి.మల్లప్ప తెలిపారు.

కళ్లను నెత్తికెక్కించుకున్న చేపలు

By

Published : Jul 18, 2019, 10:48 AM IST

పసుపు రంగు కళ్లతో నీటిపై తేలుతూ, చూడటానికి కప్పల్లా కనిపిస్తున్న వీటిని మీది కళ్ల చేప, రాకెట్ చేప అంటారు. రైనోముగిల్‌ కొర్‌సుల దీని శాస్త్రీయ నామం. అన్ని చేపలకు కళ్లు తలకి పక్కన ఉంటే, వీటికి మాత్రం తల పైభాగంలో ఉంటాయి. ఇదే దీని ప్రత్యేకత. ఇవి నీటి ప్రవాహానికి ఎదురీదుతూ గుంపులుగా తిరుగుతుంటాయి. అంత సులువుగా వలలకు చిక్కవు.
ఈ రాకెట్ చేపలు ఎల్లప్పుడూ నీటి ఉపరితలం మీదనే తేలియాడుతూ వేగంగా దూసుకుపోతాయని మహబూబ్‌నగర్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్‌ బి.మల్లప్ప తెలిపారు. నదీతీర, సముద్రతీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. రుచికరంగా ఉండటంతో మార్కెట్లో మంచి ధర పలుకుతుందని మల్లప్ప వివరించారు.

ABOUT THE AUTHOR

...view details