తెలంగాణ

telangana

ETV Bharat / state

దుందుభి ఉగ్రరూపం దాల్చుతోంది.. అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ - రెవెన్యూ శాఖ అధికారులు

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట దుందుభి వాగును జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహన్ పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని... ప్రజలెవరూ దాని పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు.

దుందుభి ఉగ్రరూపం దాల్చుతోంది.. అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్
దుందుభి ఉగ్రరూపం దాల్చుతోంది.. అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్

By

Published : Aug 17, 2020, 2:12 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట గ్రామంలో భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న దుందుభి వాగును కలెక్టర్ శర్మన్ సందర్శించారు. ఈ నేపథ్యంలో స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుందుభి వాగు ఉగ్రరూపం దాల్చుతోందని... స్థానికులను వాగు సమీప ప్రాంతాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

రహదారి మరమ్మతులకు సూచనలు...

వాగు ఉద్ధృత ప్రవాహంతో కొట్టుకుపోయిన రహదారిని... మరమ్మతులు చేసేందుకు కల్వకుర్తి, తెలకపల్లి తహశీల్దార్లకు సూచనలు అందించారు. వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం

ABOUT THE AUTHOR

...view details