వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన తమకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, జిగుట్ట తండా గిరిజనులు వట్టెం రిజర్వాయర్ కింద ముంపునకు గురైన తమ భూములకు 4 ఏళ్ల నుంచి పరిహారం చెల్లించకుండా పనులు కొనసాగిస్తున్నారని బాధితులు రిజర్వాయర్ పనులు చేపట్టిన కంపెనీ ముందు బైఠాయించారు. మధ్యాహ్నం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న తమ గోడు పట్టించుకుని నాథుడే లేరని వాపోయారు. ఇప్పటికైనా తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుంటుందని వారు డిమాండ్ చేశారు.
వట్టెం భూనిర్వాసితుల ధర్నా - vattem
వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. నాలుగేళ్లయినా.. ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని వాపోయారు. తమ గోడును పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
![వట్టెం భూనిర్వాసితుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3218838-thumbnail-3x2-land.jpg)
భూనిర్వాసితుల ధర్నా