నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలికలోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, వివిధ వార్డుల్లో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు అమ్మవారు బాలత్రిపురసుందరి దేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
కల్వకుర్తిలో బాల త్రిపురసుందరి దేవిగా అమ్మవారు
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలికలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు బాలత్రిపురసుందరి దేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా దృష్ట్యా ఆలయాల్లో భక్తులు తక్కువ సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.
కల్వకుర్తిలో బాల త్రిపురసుందరి దేవిగా అమ్మవారు
ఉదయం అమ్మవారికి అభిషేకం, అఖండ దీపారాధన, పల్లకి సేవ, గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోష పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. కరోనా ప్రభావం వల్ల భక్తులు దేవాలయాల మండపాల వద్ద స్వల్పంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ జూలూరి రమేష్ బాబు, ఆలయ కమిటీసభ్యులు, భక్తులు పాల్గొన్నారు.