నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రధాన రహదారిపై డిగ్రీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ సెమిస్టర్ పరీక్షల కోసం వచ్చిన దూర ప్రాంత విద్యార్థులకు కళాశాల వసతి గృహంలో సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
వసతి కల్పించాలంటూ డిగ్రీ విద్యార్థుల ఆందోళన - nagar kurnool news
సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలు రాసేందుకు వచ్చిన తమకు వసతిగృహ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం నుంచి జరగబోయే డిగ్రీ పరీక్షలకు కళాశాలలోనే వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
వసతి కల్పించాలంటూ డిగ్రీ విద్యార్థుల ఆందోళన
వసతి గృహం తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి లేదని కళాశాల ప్రధానాచార్యులు, వార్డెన్ చెప్పడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. జడ్చర్ల నుంచి కోదాడకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం తెలియజేశారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై మహేందర్ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.