నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యా నాయక్ కోరారు. అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సీపీఎం నాయకులు ప్లకార్డులు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది కొరత ఉందని.. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లమల్ల ప్రాంతంలోని రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో స్కానింగ్, ఎక్స్‌రే లాంటి పరికరాలు ఉన్న వాటిని వాడుకోకుండా పట్టించుకోవడం లేదన్నారు.