తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగు చట్టాలను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
సాగు చట్టాలను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Jan 12, 2021, 4:16 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎం కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు రైతులను నష్టపరిచే కార్యక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో మధుసూదన్ నాయక్​కు అందజేశారు.

ఇదీ చదవండి: సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం

ABOUT THE AUTHOR

...view details