తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఎల్​ఐ ప్రాజెక్టును సందర్శించిన సీపీఐ నేతలు.. అడ్డుకున్న పోలీసులు - కేెఎల్​ఐ ప్రాజెక్టు తాజా వార్తలు

నాగర్​ కర్నూల్​ జిల్లా ఎల్లూరు వద్ద గల కేఎల్​ఐ ప్రాజెక్టును సీపీఐ రాష్ట్ర నాయకులు సందర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిధులు కేటాయించి.. పాలమూరు-రంగారెడ్డి, కేఎల్​ఐ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు.

CPI state leaders visiting the KLI project
కేఎల్​ఐ ప్రాజెక్టును సందర్శించిన సీపీఐ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

By

Published : Oct 19, 2020, 10:44 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకంలో రెండు రోజుల క్రితం పంపు మోటార్లు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రాజెక్టును సందర్శించడానికి ఆదివారం సీపీఐ రాష్ట్ర నాయకులు రాగా.. నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

కేఎల్​ఐ ప్రాజెక్టులో పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుకు సరిగ్గా నిధులు కేటాయించకపోవడం, ప్రాజెక్టు కాలువలు పూర్తి కాకపోవడం, లిఫ్ట్​లో 5 మోటర్లు, ప్రధాన కాలువ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత కారణాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.

అధికారులు, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన మాదిరిగా పాలమూరు-రంగారెడ్డి, కేఎల్​ఐ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ, యేసయ్య, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తపుత్రిక నిశ్చితార్థం

ABOUT THE AUTHOR

...view details