నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2020 నూతన విద్యుత్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నూతన విద్యుత్ విధానంతో రైతులు, పేద, మధ్య తరగతి ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో విద్యుత్ బిల్లు మూడింతలు అధికంగా వస్తుందని పేర్కొన్నారు.