నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో తాజాగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందుల్లో ముగ్గురు ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో 24 పాజిటివ్ కేసులు - నాగర్‌కర్నూల్ జిల్లా వార్తలు
నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ సోకిన వారిలో ముగ్గురు ఎస్బీఐ సిబ్బంది కూడా ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో 24 పాజిటివ్ కేసులు
తిమ్మాజీపేట మండలం కరోనాతో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి నుంచి ప్రైమరి కాంటాక్ట్ ద్వారా మరో నలుగురికి మహమ్మారి సోకింది. అచ్చంపేట పట్టణంలో ఆరు, లింగాలలో రెండు, రంగాపూర్‌లో ఒకటి, కొల్లాపూర్‌లో రెండు, కోడేరులో మూడు కేసులు నమోదయ్యాయి.