నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం వచ్చిన వారు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో కొవిడ్ టెస్టులు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో నిలబడి పడిగాపులు కాస్తుంటే... ఇప్పుడొచ్చి పరీక్షలు చేయడం లేదని చెప్పడం ఏంటని వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్ అనుమానితుల ఆందోళన - నాగర్కర్నూల్ ఆస్పత్రి వద్ద కొవిడ్ అనుమానితుల ఆందోళన
కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిలిపివేయడం వల్ల నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్ అనుమానితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొవిడ్ టెస్టులు చేయకపోవడం ఏంటని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
తెలంగాణ వార్తలు
ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే పరీక్షలు నిలిపేయడం ఏంటని ప్రశ్నించారు. ఆస్పత్రి ఆవరణలో కొంతసేపు గందరగోళం నెలకొంది. తక్షణమే తమకు పరీక్షలు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?