నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రామంలో యువకులు శ్రమదానం చేశారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై నీరు చేరి ప్రమాదాలు జరిగినా.. గెలిచిన నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిలర్‌కు ప్రమాదం జరిగినా కౌన్సిలర్ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.
కౌన్సిలర్‌కు ప్రమాదం జరిగినా పట్టనట్టు వ్యవహరించారు.. - చుక్కాయిపల్లి గ్రామంలో యువకులు శ్రమదానం
రోడ్డుపై మురుగు నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామంలో యువకులు ఏకమయ్యారు. తమ గ్రామాన్ని తామే శుభ్రం చేసుకుంటామని నిర్ణయించుకుని రోడ్డు, మురుగు నీరును శుభ్రం చేశారు.
కౌన్సిలర్‌కు ప్రమాదం జరిగినా పట్టనట్టు వ్యవహరించారు..
ఈ నేపథ్యంలో యువకులు ఏకమై తమ గ్రామాన్ని తామే శుభ్రం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. రోడ్లపై మురుగు నీరు, చెత్త చెదారాన్ని తొలగించారు. రోడ్డుపై మురుగు నీరు వెళ్లకుండా ఒక పక్కకు వెళ్లే విధంగా చూస్తే తమకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయన్నారు.
ఇదీ చూడండి :సూర్యాపేటలో కాంగ్రెస్, తెరాస ఘర్షణ..నలుగురికి గాయాలు