తెలంగాణ

telangana

ETV Bharat / state

Cotton Left in Woman's Stomach : కడుపులో దూది మరిచారు.. వైద్యుడి నిర్లక్ష్యంతో బాలింత మృతి - Woman dies after treatment in Nagarkurnool

Cotton Left in Woman's Stomach Nagarkurnool : డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చికిత్స చేసిన డాక్టర్​ను సస్పెండ్​ చేశారు.

Infant Died
Infant Died Due To Doctor Negligence

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 2:16 PM IST

Cotton Left in Woman's Stomach Nagarkurnool :ఈ మధ్య కాలంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అమాయక (Infant Death Due to Doctor Negligence)ప్రజలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. కాపాడాల్సిన వైద్యుడే.. చికిత్స పట్ల అశ్రద్ధ వహించడం వల్ల నమ్మి వస్తున్న ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేసిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.

Woman Died Due To Doctor Negligence Nagarkurnool :ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... దర్శన్​గడ్డా తండాకు చెందిన గిరిడన మహిల రోజా నిండు గర్భిణి. తనకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 15వ తేదీనా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో రోజాను చేర్పించారు. ఆమెకు డాక్టర్​ కృష్ణ శస్త్ర చికిత్స చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు రోజాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేశారు వైద్యులు. ఆ సమయంలో పొరపాటున కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. అనంతరం ఆమెను మూడు రోజులు అబ్జర్వేషన్​లో ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ చేశారు. ఇంటికి వెళ్లాక రోజాకు స్వల్ప రక్తస్రావం మొదలైంది.

'200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'

మంగళవారం రోజున సమస్య ఎక్కవ కావడంతో ఆమెను మరోసారి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు.. రోజాకు ఇది వరకే చికిత్స చేసిన డాక్టర్​ కృష్ణ నిర్వహించే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లాక సాయంత్రం వరకు కాలయాపన చేసి... అక్కడి వైద్యులు హైదరాబాద్​ తీసుకెళ్లాలని సిఫారసు చేశారు. అనంతరం హైదరాబాద్​లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రోజా మృతి చెందింది. శస్త్రచికిత్స చేసిన డాక్టర్​ కృష్ణ రోజా కడుపులో దూదిని మరచిపోవడం వల్లనే తీవ్ర రక్తస్రావం అయిందని దాని కారణంగానే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బుధవారం రోజున అచ్చంపేటలో రాస్తారోకో చేశారు. డాక్టర్​ కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డాక్టర్​ సస్పెండ్ ​: విప్​ గువ్వల బాల్​రాజు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రోజా భర్త రిక్యా ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్​ తెలిపారు. రోజా మృతికి కారణమైన ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డా. కృష్ణను సస్పెండ్​ చేసినట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్​ కమిషనర్​ డా. అజయ్​కుమార్​ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశాల మేరకు హాస్పిటల్​లో కమిషనర్ విచారణ చేపట్టారు.

కాన్పు కోసం వెళ్తే కొవిడ్‌ అన్నారు.. మృతదేహం అప్పగించారు

ఆస్పత్రిలో రక్త నిల్వలు లేక బాలింత మృతి

ABOUT THE AUTHOR

...view details