తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కొవిడ్​ నిబంధనలు పాటించాలి'

నాగర్ కర్నూల్ జిల్లాలో.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొల్లాపూర్, వీపనగండ్ల ప్రభుత్వ ఆస్పత్రులలో ఫ్రంట్​లైన్ కార్మికులకు తొలి టీకా అందించారు.

corona-vaccination-was-initiated-by-mla-bhiram-harshavardhan-reddy-at-kolhapur-government-hospital-nagar-kurnool-district-and-vipanagandla-mandal-government-hospital
'వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కొవిడ్​ నిబంధనలు పాటించాలి'

By

Published : Jan 18, 2021, 4:48 PM IST

కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ నర్మద, వీపనగండ్లలో వాచ్​మన్ ఆంజనేయులుకి మొదటి టీకాను ఇచ్చారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిమాసాల నుంచి కొవిడ్ వైరస్ వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సంతోషించాల్సిన విషయమన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్​ నిబంధనలు పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడతలో ఫ్రంట్​లైన్ వారియర్స్​కు టీకా ఇచ్చి.. విడతల వారీగా ప్రజలందరికి వ్యాక్సినేషన్ అందజేస్తామన్నారు.

ఇదీ చదవండి:అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ తిరస్కరించిన న్యాయస్థానం

ABOUT THE AUTHOR

...view details