తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి' - నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటింటి సర్వే

ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. ప్రజలంతా ఈ సర్వేకు సహకరించాలని కోరారు.

nagar kurnool district, nagar kurnool district home survey
నాగర్​ కర్నూల్ జిల్లాలో ఇంటింటి సర్వే, నాగర్​కర్నూల్ కలెక్టర్

By

Published : May 25, 2021, 5:04 PM IST

నిర్లక్ష్యానికి తావులేకుండా ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని నాగర్​ కర్నూల్ జిల్లా కలెక్టర్.. వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వారితో ఎప్పుడు ఫోన్​లో సంప్రదిస్తూ ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవాలని సూచించారు. బిజినేపల్లి, పెద్ద తాండ, తిమ్మాజిపేట మండలాల్లో సర్వే తీరును పరిశీలించారు. సర్వేను పక్కాగా నిర్వహించాలని చెప్పారు.

గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తైన కల్లాలకు వెంటనే ఫొటో అప్​లోడ్ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. బిజినేపల్లి ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details