నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన నెలన్నర బాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. అనారోగ్యంతో హైదరాబాద్లోని నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారికి కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారుల వెల్లడించారు.
నెలన్నర బాబుకు కరోనా పాజిటివ్ - నాగర్‌కర్నూల్ జిల్లా వార్తలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ నెలన్నర చిన్నారికి కరోనా సోకింది. అనారోగ్యంతో నిలోఫర్‌లో చికిత్స పొందుతుండగా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
నెలన్నర బాబుకు కరోనా పాజిటివ్
అయితే బాబు తల్లిదండ్రులకు నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు. చిన్నారి తల్లిదండ్రుల గ్రామంలో అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'