నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి దిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్ధనల్లో పాల్గొన్న నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో జిల్లా కేంద్రంలో ఉన్న 24 హెల్త్ టీంలను అదనపు కలెక్టర్ మను చౌదరి అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలి, వ్యాధి సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సూచనలిచ్చారు.
జిల్లాలో పాజిటివ్కేసు నమోదు.. అప్రమత్తమైన హెల్త్టీంలు - అదనపు కలెక్టర్ మను చౌదరి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం నింపేలా హెల్త్టీంలకు అదనపు కలెక్టర్ మను చౌదరి దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో పాజిటివ్కేసు నమోదు.. అప్రమత్తమైన హెల్త్టీంలు
సాధారణంగా వచ్చే దగ్గు, జలుబులకు భయపడవద్దని.. సామాజిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ ప్రజలను కోరారు. ప్రతి హెల్త్ టీంకు ఒక డాక్టర్ ఉంటారని, ప్రజలకు తగు సూచనలు చేస్తారని తెలిపారు. అనంతరం హెల్త్ టీంలకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.