నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అకాల వర్షం కురిసింది. రైతులు మార్కెట్లో ఎండ పెట్టుకున్న మక్కలు తడిసి ముద్దయ్యాయి. మక్కలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్కలు ఎండలేదని పదకొండు పన్నెండు వందల రేటు చూపడంతో... మక్కలను ఆరాపెట్టుకుందామని మూడు నాలుగు రోజులుగా మార్కెట్లోనే ఆరబెట్టుకున్న రైతులకు ఇలా అకస్మాత్తుగా వర్షం రావడంతో గింజలు మొత్తం తడిసిపోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు తమ గోడు వెల్లుబుచ్చారు. సుమారు వెయ్యి క్వింటాళ్ల మక్కలు తడిసాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అకాల వర్షానికి తడిసిన మక్కలు.. బోరుమంటున్న రైతులు - Corns drenched in the rain at nagar karnool district
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది నాగర్ కర్నూలు జిల్లాలోని రైతుల దుస్థితి. అసలే మక్కలకు సరైన ధర లేక అన్నదాతలు ఆవేదన చెందుతూంటే... అకాల వర్షంతో మరింత నష్టానికి గురికావాల్సిన దుస్థితి దాపురించింది.
అకాల వర్షానికి తడిసిన మక్కలు.. బోరుమంటున్న రైతులు