తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది' - raajiv raithu bharosa

రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చేరుకున్నాడు. ఆయనతో పాటు మాజీ ఎంపీ మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వీరికి ఘన స్వాగతం పలికారు.

Congress Working President Rewanth Reddy Nagar reached Ellikal village in Kalvakurthi zone of Kurnool district as part of raajiv raithu bharosa
'కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది'

By

Published : Feb 10, 2021, 4:55 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్ట పరిచే చట్టాలను తీసుకొస్తున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చట్టాలు అమలైతే రాబోయే రోజుల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామం చేరుకున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబట్టారు.

దిల్లీ సరిహద్దుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 80 రోజులు కావస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 195 మంది రైతులు మరణించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details