దేశానికి వెన్నెముకలాంటి రైతులను ప్రధాని విమర్శించడం దారుణమని కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి చేరుకున్నారు. రైతులవి బూటకపు దీక్షలని అవహేళన చేయటం తగదని రేవంత్ హితవు పలికారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెరాస, భాజపా పార్టీలు ఒక్కటే అని విమర్శించారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందని తెలిపారు.
రైతులను ప్రధాని విమర్శించడం తగదు: రేవంత్ రెడ్డి
రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర బుధవారం రాత్రి కల్వకుర్తికి చేరుకుంది. యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేశారు. రైతులను ప్రధాని విమర్శించడం తగదని హితవు పలికారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను ప్రధాని విమర్శించడం తగదు: రేవంత్ రెడ్డి