పెట్రోల్ ధరను సెంచరీ దాటించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని నాగర్ కర్నూల్ డీసీసీబీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. ఇంధన ధరల పెంపునకు నిరసనగా జిల్లా కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదుట నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Petrol price hike: 'ఆ ఘనత ప్రధానికే దక్కుతుంది' - ఇంధన ధరల పెంపు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.

protest by congress leaders
కరోనా కారణంగా ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు కేంద్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యులపై మరింత భారం మోపుతోందని వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Petrol Hike:ఆగని పెట్రో బాదుడు.. 17 జిల్లాల్లో సెంచరీ దాటింది