తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదాయమే లేదు.. విద్యుత్ బిల్లుల వసూళ్లా?' - congress protest against power bills in kalwakurthi

లాక్​డౌన్​ సమయంలోని విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బిల్లుల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఆదాయం లేని రోజుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ మండిపడ్డారు.

congress-protest-against-power-bills-in-kalwakurthi-at-nagarkurnool
'ఆదాయం లేని సమయంలో విద్యుత్ బిల్లులు ఎలా వసూలు చేస్తారు?'

By

Published : Jul 6, 2020, 3:24 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి పాల్గొని... పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ కారణంగా పేదలకు, మధ్యతరగతి వారికి ఉపాధి లేకుండా పోయిందని.. ఆదాయం లేని రోజుల్లో విద్యుత్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే వీటిని భరించాలన్నారు. అనంతరం ఏఈ శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details