రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో కలిసి జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారి జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్నానని మల్లు రవి తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే మొట్టమొదటి ప్రయత్నంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు మోదీ... రాహుల్‌గాంధీకి మధ్యే కానీ కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు.
'నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరులా పనిచేస్తా' - congress-pracharam
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రోడ్‌షోలు నిర్వహిస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అలంపూర్‌లో పర్యటించిన నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి... నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరులా పనిచేస్తానన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో
TAGGED:
congress-pracharam