ఇటీవల కురిసిన వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం వరిదేలా గ్రామంలోని చెరువు పూర్తిగా నిండింది. వరద నీరు.. గ్రామంలోకి ప్రవహించి నివాసాల్లోకి రావడం వల్ల.. ఎమ్మెల్యే, భాజపా నేతలు కలిసి.. చెరువు కట్టను జేసీబీ సాయంతో తొలగించారు. చెరువు కట్టకు రెండు వైపులా.. కంపను కంచెగా వేశారు.
గొయ్యిలో పడి వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే కారణమని కాంగ్రెస్ ధర్నా
చెరువు అలుగు పారి.. ఆ వరద నీరు గ్రామంలోకి రాకుండా చెరువు కట్టకు కొట్టిన గండిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. గొయ్యి తవ్వించడం వల్లే ప్రమాదం జరిగిందని, ఎమ్మెల్యే ఈ ఘటనకు బాధ్యత వహించాలని, మృతుడికి నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు.
ఎమ్మెల్యే తీయించిన గొయ్యిలో పడి వ్యక్తి మృతి.. కాంగ్రెస్ ధర్నా
కంచె వేసిన గొయ్యిని గమనించకుండా.. ద్విచక్ర వాహనం మీద వేగంగా వచ్చిన గ్రామానికి చెందిన నారాయణ గొయ్యిలో పడి మృతి చెందాడు. గొయ్యిని పూడ్చకుండా అలాగే వదిలేయడం వల్లే.. నారాయణ చనిపోయాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మృతుడికి నష్ట పరిహారం చెల్లించి.. గొయ్యిని వెంటనే పూడ్చి వేయాలని డిమాండ్ చేశారు.