తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ.. కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్​ ధర్నా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. గాంధీ పార్క్​ నుంచి ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Congress Party Protest At Nagar Karnool Collectrate Agains Agri bills
వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ.. కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్​ ధర్నా

By

Published : Sep 28, 2020, 3:48 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ధర్నా నిర్వహించారు. గాంధీ పార్క్ నుంచి ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బిల్లులు కార్పొరేట్​ శక్తులకు కొమ్ము కాసేలా ఉన్నాయని.. రైతు, వ్యవసాయ రంగాలను మరింత ప్రమాదంలో పడేసేలా ఉన్న ఈ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్​ రెడ్డి డిమాండ్​ చేశారు.

రైతులకు నష్టం కలిగించే బిల్లును అడ్డుకుని తీరుతామని, వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని.. అన్నదాతలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి వారి నడ్డివిరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :సర్వేతో గట్టు గొడవలు లేకుండా పోతాయి: హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details