కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీ మల్లు రవి, జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి కార్యాలయం ముందు బైఠాయించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ఆందోళన - congress protest latest news
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ఆందోళన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారని నేతలు మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు ఈ బిల్లు కొమ్ముకాసే విధంగా ఉందని వారు విమర్శించారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ మధుసూదన్ నాయక్‌కు అందజేశారు.
ఇదీ చూడండి:పెరిగిన బంగారం, వెండి ధరలు