తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్రీశైలం ప్రమాదంతో వారికి లాభం.. విచారిస్తే నిజం బయటికొస్తుంది' - శ్రీశైలం ఘటనపై ప్రధానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం ప్రమాదంపై ప్రధాని మోదీకి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. ఈ ప్రమాదం వల్ల ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరుగుతుందని ఆరోపించారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.

revanth reddy
revanth reddy

By

Published : Aug 31, 2020, 12:33 PM IST

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. సీబీఐతో పాటు సెంట్రల్‌ ఎలక్ట్రికల్ అథారిటీ(సీఈఏ)తో శాఖాపరమైన విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనలో క్రిమినల్ కోణం ఉందని ఆరోపించారు. వందల కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని ఆరోపించారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు ఎండీగా ఉండడం వల్ల జెన్కో, ట్రాన్స్కో నష్టాల్లో కూరుకపోయాయని ఆరోపించారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపించాలని విజ్ఞప్తి చేశారు. బయట ఎవరి దగ్గరి నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details