శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర ప్రమాద ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం లత్తీపూర్ పెట్రోల్ బంకు వద్ద రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కన్నుంచి ఉప్పునూతల పోలీసు స్టేషన్కు తరలించారు.
మృతులకు రూ.కోటి పరిహారం అందించాలి..
అరెస్టు చేయాల్సింది తమను కాదని, ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావులను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చే దిశగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల కుటుంబాలను పరామర్శించాకే వెళ్తామన్నారు.