నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కేఎల్ఐ మోటార్లను పరిశీలించేందుకు వస్తున్న మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేశారు. మానవ తప్పిదం వల్లనే పంపు మోటార్లకు ప్రమాదం జరిగిందని మల్లు రవి ఆరోపించారు. పంపు మోటార్ దెబ్బతినడం వల్ల నీటిమట్టం పెరిగి పూర్తిగా మునిగిందని ఆరోపించారు.
'పాలమూరు-రంగారెడ్డి సొరంగ పనుల్లో బ్లాస్టింగ్ వల్లే ప్రమాదం' - congress leaders arrested
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కేఎల్ఐ మోటార్లను పరిశీలించేందుకు వస్తున్న మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా కేఎల్ఐ పంపు వద్ద పాలమూరు-రంగారెడ్డి పనులు చేపట్టవద్దని నిపుణులు చెప్పినా వినకుండా పనులు చేపట్టటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంపీ ఆరోపించారు.
congress mp mallu ravi arrested in kollapur
ప్రధానంగా కేఎల్ఐ పంపు వద్ద పాలమూరు-రంగారెడ్డి పనులు చేపట్టవద్దని నిపుణులు చెప్పినా... సీఎం కేసీఆర్ అక్కడ నిర్మాణ పనులు చేపట్టడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి సొరంగ పనుల్లో బ్లాస్టింగ్ చేయడం వల్ల పంపు మోటారు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.