తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాలమూరు గడ్డ.. పేదోడి అడ్డా.. దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు' - Nagarkurnool congress meeting latest news

Congress Leaders Fires on BRS Govt : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించామని పేర్కొన్నారు. తాము కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫొటోలు దిగుతూ.. సందర్శనకు వచ్చిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, గిరిజనులపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

'దళితులు, గిరిజనులపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'
'దళితులు, గిరిజనులపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'

By

Published : Jan 22, 2023, 9:54 PM IST

Updated : Jan 23, 2023, 6:41 AM IST

'దళితులు, గిరిజనులపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'

Congress Leaders Fires on BRS Govt : దళితులు, గిరిజనులపై దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 'దళిత, గిరిజన ఆత్మగౌరవం' కాంగ్రెస్‌ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము కట్టిన ప్రాజెక్టుల వద్ద అధికార బీఆర్​ఎస్​ నేతలు ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. ఇప్పటికీ పూర్తి చేయలేదని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై ప్రశ్నించిన నాగం జనార్ధన్‌రెడ్డి, అతని వెంట వచ్చిన దళిత, గిరిజనుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ తప్పుబట్టారు. పాలమూరు గడ్డ పేదోడి అడ్డా అని వ్యాఖ్యానించిన ఆయన.. దళితులు, గిరిజనులపై దాడిని సహించబోమని హెచ్చరించారు. నాగంతో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఏమైందో.. మర్రి జనార్దన్​ రెడ్డికీ అదే పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే పాలమూరులో మొత్తం సీట్లు గెలిపించే బాధ్యత తనదని స్పష్టం చేశారు.

దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. పాలమూరులో ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మేము కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫొటోలు దిగుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గిరిజనుడిపై కాలు వేసి తొక్కుతున్నావ్. పాలమూరు గడ్డ పేదోడి అడ్డా. నాగంతో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి ఏమైందో మర్రి జనార్దన్ పరిస్థితీ అదే అవుతుంది. - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఆత్మ గౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజనులపై ఇంకా దాడులు జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రం రాచరిక వ్యవస్థలో లేదని.. సంపూర్ణ ప్రజాస్వామ్యంలో ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని సూచించారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన గిరిజనుడు వాల్య నాయక్, దళిత నాయకుడు రాములును కింద పడేసి మెడపై కాలు వేసి తొక్కిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతోనే ఆ పార్టీ నాయకులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అండ చూసుకుని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు పేట్రేగిపోతున్నాయని ఆక్షేపించారు.

ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో దళిత, గిరిజనులపై ఇంకా దాడులు జరుగుతున్నాయి. దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రం సంపూర్ణ ప్రజాస్వామ్యంలో ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలి. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన వారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం అండ చూసుకుని బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చూడండి..

బీజేపీ కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

'హాత్‌ సే హాత్‌ జోడో'పై కుదరని ఏకాభిప్రాయం.. ఇంకెప్పుడో మరి?

Last Updated : Jan 23, 2023, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details