నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే ప్రజాయుద్ధం తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో పర్యటించారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో అణు ఇంధన విద్యుత్ ఎందుకు అని ప్రశ్నించారు.
మిగులు విద్యుత్ రాష్ట్రానికి అణు ఇంధన విద్యుత్ ఎందుకు? - v.hanumantha rao on uranium mining in nagar kurnool
అడవుల అభివృద్ధి పేరుతో నల్లమలలో గుట్టుగా యురేనియం తవ్వకాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రానికి అణు ఇంధన విద్యుత్ ఎందుకని నిలదీశారు.
అమ్రాబాద్‌లో వీహెచ్
యురేనియం తవ్వకాల వల్ల అడవి బిడ్డలకు అన్యాయం జరిగితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వీహెచ్ మీడియా సమావేశం జరుగుతుండగా అమ్రాబాద్ సీఐ వచ్చి ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదని చెప్పడం వల్ల కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.