గతంలో ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఆదుకుందని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలోనే సంపూర్ణంగా దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. పేదలకు సంవత్సరానికి 72వేల రూపాయలు ఇచ్చి ఆసరాగా ఉంటుందన్నారు. ఈ పథకంతో 25కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లను తెరాస ఎంపీ అభ్యర్థులుగా నియమించారన్నారు. పార్లమెంట్లో ప్రశ్నించే, పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
భాజపా కార్పొరేట్ పార్టీ: కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి - భాజపా కార్పొరేట్ పార్టీ: మల్లు రవి
దేశంలో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే కాంగ్రెస్ లక్ష్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ రైతు, పేదల పార్టీ అయితే భాజపా కార్పొరేట్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

భాజపా కార్పొరేట్ పార్టీ: మల్లు రవి