తెలంగాణ

telangana

ETV Bharat / state

దుకాణ సముదాయాల టెండర్లలో గందరగోళం

నాగర్ కర్నూల్ జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ దుకాణ సముదాయాల టెండర్లలో గందరగోళం చోటు చేసుకుంది. తమకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇష్టమొచ్చిన రీతిలో టెండర్లు ఎలా పిలుస్తారని ఆందోళన చేశారు.

దుకాణ సముదాయాల టెండర్లలో గందరగోళం
దుకాణ సముదాయాల టెండర్లలో గందరగోళం

By

Published : Sep 3, 2020, 5:26 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ దుకాణ సముదాయాల టెండర్లలో గందరగోళం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 47 దుకాణ సముదాయాలను నిర్మించి ఆ షాపులకు వేలంపాట ద్వారా టెండర్లకు పిలుపునిచ్చారు. 785 మంది లబ్ధిదారులు ఒక్కొక్క దరఖాస్తుకు రూ. 2,000 చెల్లించారు. ఇందులో 745 మంది రూ. 50 వేలు డీడీలు చెల్లించి వేలంపాటలో పాల్గొనడానికి వచ్చారు. తీరా అధికారుల నిబంధనలను చూసి లబ్ధిదారులు బిత్తరపోయారు. ఒక డీడీ ఫాం ద్వారా దుకాణాల సముదాయాల్లోని కేటాయించిన వర్గంలోని ఎన్ని షాపులకైనా వేలంపాట పడవచ్చని నిబంధన ఉండటం వల్ల ఒక్కొక్కరు 10 డీడీలు తీశామని... ఈ నిబంధన ముందే చెబితే ఇప్పుడు ఇంత నష్టపోయే వారం కాదని వాపోయారు.

షాపుకు అద్దె రుసుంను నిర్ణయించి డిప్ పద్ధతి ద్వారా షాపులను కేటాయించి ఉంటే సరిపోయేదన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇష్టమొచ్చిన రీతిలో టెండర్లు ఎలా పిలుస్తారని ఆందోళన చేశారు.

ABOUT THE AUTHOR

...view details