ఇసుక పంపిణీ వివాదంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా నాగులపల్లి గ్రామంలో జరిగింది. నిందితులపై కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పికెట్ నిర్వహించారు.
ఇసుక పంపిణీలో వివాదం.. పరస్పరం ఇరువర్గాల దాడులు - నాగర్‌కర్నూల్ జిల్లా తాజా వార్తలు
ఇసుక పంపిణీ విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా నాగులపల్లి గ్రామంలో జరిగింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
జిల్లాలోని నాగులపల్లి గ్రామంలో చెలరేగిన ఇసుక పంపిణీ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గంవారిపై రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యర్థుల ఇళ్లలోకి చొరబడిన కొందరు వ్యక్తులు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రాణ భయంతో మహిళలు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై ఓబుల్‌రెడ్డి తెలిపారు.