నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ శర్మన్, జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి పరిశీలించారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన 3,400 మందికి టీకాలు ఇస్తున్నామని కలెక్టర్ అన్నారు.
Super spreaders: వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శర్మన్ - అచ్చంపేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శర్మన్
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు ఆసక్తి చూపుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ టీకా తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ సూచించారు.
అచ్చంపేటలో టీకా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మొత్తం ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోందని ఈ రోజు వరకే సూపర్ స్ప్రెడర్లకు అవకాశం ఉందని చెప్పారు. వ్యాక్సిన్ కేంద్రంలో భౌతిక దూరం పాటించాలని అన్నారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని జడ్పీ ఛైర్పర్సన్ సూచించారు.
ఇదీ చదవండి:Kishan Reddy: 'వ్యాక్సిన్ వినియోగంలో ప్రపంచంలోనే మూడోస్థానం'