తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆక్సిజన్ సిలిండర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి' - collector sharman inspection in area hospital

నాగర్​ కర్నూల్​ జిల్లా ఏరియా ఆస్పత్రిని కలెక్టర్​ శర్మన్​ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని కరోనా టెస్టుల విభాగం, ఐసోలేషన్​ కేంద్రాలు తదితర వాటిని స్వయంగా పరిశీలించారు.

collector sharman inspection in government hospital
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్​ శర్మన్​ ఆకస్మిక తనిఖీ

By

Published : Apr 26, 2021, 3:11 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ శర్మన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కరోనా టెస్టుల విభాగం, వార్డులు, ఐసోలేషన్ సెంటర్లను కలెక్టర్​ పరిశీలించారు. ఆక్సిజన్ సిలిండర్ నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో వైద్యులతో కలిసి స్వయంగా పరిశీలించారు. కొవిడ్​ రోగులకు అందుతున్న సేవలు, పరీక్షల నిర్వహణ తీరు పరిశీలిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందిని ఉపనియామకం చేసుకోవాలని వైద్య శాఖ అధికారిని కలెక్టర్​ ఆదేశించారు. ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:సికింద్రాబాద్​లోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details