తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో విడత ఫీవర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్​ - నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జిల్లా కలెక్టర్ శర్మన్ పర్యటించి... ఇంద్రానగర్, టంగాపూర్, టీచర్స్ కాలనీల్లో జరుగుతున్న రెండో విడత ఫీవర్ సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలు తెలుసుకుని, ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

nagar kurnool Collector sharman
రెండో విడత ఫీవర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్​

By

Published : May 24, 2021, 4:53 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జిల్లా కలెక్టర్ శర్మన్ పర్యటించారు. పట్టణంలోని ఇంద్రానగర్, టంగాపూర్, టీచర్స్ కాలనీల్లో జరుగుతున్న రెండో విడత ఫీవర్ సర్వేను పరిశీలించారు. సర్వే ఏవిధంగా చేస్తున్నారు, మందులు ఎలా ఇస్తున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి రెండో విడత ఫీవర్ సర్వే చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. సర్వేలో భాగంగా జ్వరం వచ్చిన వారిని ముందే గుర్తించి ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారు, ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, లాక్​డౌన్ సడలింపు సమయంలో బయటకు వచ్చినపుడు భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details