తెలంగాణ

telangana

ETV Bharat / state

'నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ చౌహాన్​ ఉదయపు నడక చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగి.. ప్రజలకు పలు సూచనలు చేశారు.

By

Published : Aug 7, 2020, 11:06 AM IST

collector sharman chowhan morning walk in achampetcollector sharman chowhan morning walk in achampet
'నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు, రహదారులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పాలనాధికారి ఎల్​.శర్మన్​ చౌహాన్​ పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ ఉదయపు నడక చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పలు కాలనీలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు, సులభ్​ కాంప్లెక్స్​లు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్ ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

మార్నింగ్​ వాక్​లో భాగంగా ఇద్దరు మతిస్థిమితం లేనివారిని కలెక్టర్​ గుర్తించారు. వారికి కొత్త దుస్తులు ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వ్యాపారులు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేల రాయితీ రుణాల గురించి చిరు వ్యాపారులకు వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో 'మెగా చోరీ'.. పట్టుబడిన నగదు

ABOUT THE AUTHOR

...view details