గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్యంపై అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని... నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహన్ తెలిపారు. అందరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని... అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. బల్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. మాస్కు లేకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా: కలెక్టర్ - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
మాస్కు లేకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని... నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహన్ తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు, అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ పర్యటన
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలను పరిశీలించారు. శ్మశాన వాటిక పనుల్లో తీవ్ర జాప్యం చేసినందుకుగాను మదేపూర్ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు, నాయకులకు పలు సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి