ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సమయపాలన తప్పని సరిగా ఉండాలని టైమ్‌కి విధులకు హాజరవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహాన్ హెచ్చరించారు. చిరుజల్లులు పడుతున్నా లెక్కచేయకుండా కాలినడకన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
సమయపాలన పాటించని ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తప్పవు: కలెక్టర్ - nagar karnool district latest news
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహాన్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
సమయపాలన పాటించని ప్రభుత్వ ఉద్యోగలపై చర్యలు తప్పవు: కలెక్టర్
ఉదయం నేరుగా ఆర్డిఓ, జిల్లా పరిషత్, ఎంపీడీవో, డీఈఓ, మహిళా సమాఖ్య కార్యాలయాలను వెళ్లి పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఉద్యోగ సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణ ప్రాంతాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడం గమనించి మరోసారి ఇలా కనిపిస్తే అందరిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం