తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ : నోటీసులు జారీ - Sharman Chauhan conducted surprise inspections in villages

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని గ్రామాలలో జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులకి , ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు.

Collector Sharman Chauhan conducted surprise inspections in villages under the uppanuthal mandal nagar kurnool district
కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ : నోటీసులు జారీ

By

Published : Jan 4, 2021, 5:06 PM IST

పారిశుద్ధ్య పనులు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై నాగర్ కర్నూల్​ కలెక్టర్​ శర్మన్ చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి, మారిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అస్తవ్యస్తంగా ఉండటంతో..

పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలతో పాటు.. గ్రామపంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. గ్రామాల్లో అన్ని వీధులు తిరిగి .. అక్కడ నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చాలా చోట్ల పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో సంబంధిత అధికారులు , సర్పంచ్​లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులు పల్లె ప్రకృతి వనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మామిళ్ళపల్లి, మారి పల్లి, లక్ష్మాపూర్ గ్రామాల సర్పంచ్​లకు, కార్యదర్శులతో పాటుగా.. మండల ఎంపీఓకు నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి:ఆ ఘనత సీఎం కేసీఆర్​కే దక్కింది: మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details