నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శర్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించి అక్కడి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ విభాగంలో గత కొద్ది నెలలుగా సేవలు పొందిన రోగుల జాబితాను పరిశీలించారు. గర్భిణీల వార్డు, చంటిపిల్లల శస్త్రచికిత్స విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగానికి వచ్చే రోగులను వెంటనే సంబంధిత వైద్య నిపుణులు పరీక్షించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. నిష్ణాతులైన వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.
కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శర్మ ఆకస్మిక తనిఖీ - cci purchasing centres in nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించి అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శర్మ ఆకస్మిక తనిఖీ
అనంతరం కల్వకుర్తి, ఊరుకొండ మండలాల్లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల అధికారులతో మాట్లాడారు. పత్తి రైతులకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు అందుబాటులో ఉండి పత్తి సాగు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఢీ అంటే ఢీ అంటున్న కారు, కమలం... పాతబస్తీలో పతంగి హవా