తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షంలో తడుస్తూ రోడ్డుపై కూరగాయలు కొన్న కలెక్టర్ - నాగర్​కర్నూలులో పర్యటించిన కలెక్టర్ శర్మాన్​ చౌహాన్

కలెక్టర్ శర్మన్ చౌహాన్​ గురువారం నాగర్​కర్నూలు జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో పర్యటించారు. లింగాల మండలం నుంచి వస్తుండగా మార్గమధ్యంలో సురాపూర్ అనే గ్రామం వద్ద వర్షం పడుతున్నా రైతులు కూరగాయలు అమ్మడాన్ని గమనించిన కలెక్టర్.. వారి వద్ద కూరలు కొన్నారు.

collector sarmaan chouhan purchased vegetables at nagarkurnool
వర్షంలో తడుస్తూ రోడ్డుపై కూరగాయలు కొన్న కలెక్టర్ శర్మాన్ చౌహాన్

By

Published : Aug 14, 2020, 1:32 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్​ గురువారం జిల్లాలో సందర్శించారు. మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయం, గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయం, పారిశుద్ధ్య పనులు, హరితహారం కార్యక్రమం, డంపింగ్​ యార్డు, వైకుంఠధామాలు, గ్రామాల్లో రైతు వేదిక భవనాలు, ప్రకృతి వనా నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు.. ఉదయం ఆరు గంటల నుంచి పర్యవేక్షించాలని కోరారు. స్థానికంగానే ఉంటూ వారు ఉండే అడ్రస్​లను 15 రోజుల్లో అధికారులకు నివేదించాలని సర్క్యూలర్ జారీ చేశారు.

ఉదయం నుంచి జిల్లాలో వర్షం పడుతున్నా.. లెక్కచేయకుండా జిల్లాలోని 20 మండలాల్లో 18 మండలాల కేంద్రాలను పర్యవేక్షించారు. లింగాల మండలం నుంచి వస్తుండగా మార్గమధ్యంలో సురాపూర్ అనే గ్రామం వద్ద వర్షం పడుతున్న రైతులు కూరగాయలు అమ్మడాన్ని గమనించిన కలెక్టర్... వాహనం దిగి వచ్చి వారితో ముచ్చటించారు. వారి వద్ద టమాటాలు, మిరపకాయలు, కాకరకాయలు, బెండకాయలు తీసుకొని వంద రూపాయలు వారికి ఇచ్చారు.

ఇదీ చదవండి:'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details