అమ్రాబాద్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉన్న పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. వన్యప్రాణులకు ఏర్పాటు చేసిన వసతులను జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయి శేఖర్ పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్‌హౌస్‌లో అటవీ అధికారులతో సమీక్షించారు.
'వన్యప్రాణుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోండి' - LOCK DOWN UPDATES
నల్లమలలో ఉండే వన్యప్రాణులకు ఏర్పాటు చేసిన వసతులను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కరోనా వ్యాపిస్తున్న దృష్ట్యా... జంతువులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
!['వన్యప్రాణుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోండి' COLLECTOR REVIEW ABOUT NALLAMALA FOREST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6939576-690-6939576-1587821076977.jpg)
'వన్యప్రాణుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోండి'
ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్ జూపార్క్‌లో నాలుగేళ్ల పులికి వైరస్ సోకిన దృష్ట్యా... అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జంతువులు అనారోగ్యానికి గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జంతువులకు సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నారు. అడవిలోకి ఇతరులను ఎవరినీ అనుమతించరాదని ఆదేశించారు.